కేరళ వరదలు : ఇదో  మార్కెటింగ్‌ జిమ్మిక్కంటూ బాస్‌పై ఆగ్రహం

0
414

ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతున్న కేరళ ప్రజలకు ఆదుకునేందుకు  మేము సేతం అంటూ చిన్నా పెద్దా అంతా తమ వంతుగా  తోచిన విరాళాన్ని ప్రకిస్తున్నారు.  అయితే పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో  విజయ్ శేఖర్ శర్మ   చేసిన డొనేషన్‌ విమర్శలకు తావిచ్చింది.  ట్వీట్లు కాదు,  విరాళాలు కావాలంటూ బాలీవుడ్‌ నటులపై  ఆగ్రహించిన నెటిజన్లు  తాజాగా బిజినెస్‌ టై​కూన్‌పై విమర్శలు  గుప్పించారు.

వివరాల్లోకి వెడితే విజయ్‌ శేఖర్‌శర్మ కేరళ బాధితులపట్ల తన  ఔదార్యాన్ని ప్రకటించారు. కేరళీయులకు 10వేల రూపాయలు దానం చేశానంటూ, ఒక స్క్రీన్‌షాట్‌ను ట్వీట్‌ చేశారు. అలాగే బాధితులకు అందరూ సాయపడాలంటూ అభ్యర్థించారు. అంతేకాదు పేటీఎం యాప్‌ ద్వారా  డొనేషన్లు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అక్కడితో ఆగితే పెద్దగా ఎవరూ స్పందించేవారు కాదేమో. ఎందుకంటే తన సంస్థ ఘన విజయం, సాధించిన భారీ ఆదాయంపై ఆయన మరో ట్వీట్‌ చేశారు. కేవలం 48 గంటల్లో దేశవ్యాప్తంగా నాలుగు లక్షల యూజర్లను అదనంగా సాధించామనీ, పేటీఎం ఆదాయం 10కోట్ల రూపాయలను అధిగమించిందని పేర్కొన్నారు.  అదీ  కేరళ వరద సహాయ ట్రాన్సాక్షన్స్‌తో కలిపి ఈ మొత్తాన్ని సాధించినట్టు ట్వీట్‌ చేశారు. దీంతో నెటిజన్లు ఆగ్రహం తారా స్థాయికి చేరింది. బిలియనీర్‌ ఇచ్చే దానం కేవలం 10 వేల రూపాయలా అని కొందరు, ఇదో  మార్కెటింగ్‌ జిమ్మిక్కంటూ  మరికొందరు మండిపడ్డారు.  ఇది ఇలా ఉండగా కేవలం మూడు రోజుల్లో 8లక్షలకు పైగా వినియోగదారులను సాధించిన పేటీఎం రూ.20వేలకోట్లను క్రాస్‌ చేయడం గమనార్హం.

కాగా  దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత  డిజిటల్‌ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా పేటీఎం పెద్ద ఎత్తున లాభాలను సాధించింది. ‘పేటీఎం కరో’  అంటూ యూజర్లను  ఆకర్షించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here