100 ట‌న్నుల ఆహార ప‌దార్ధాల‌ను కేర‌ళ‌కు పంపిన తెలంగాణ‌

0
363

ప్ర‌కృతి ప్ర‌కోపానికి కేర‌ళ చిగురుటాకులా వ‌ణుకుతోంది. ల‌క్ష‌లాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. స‌రైన తిండి, మంచి నీరు లేక విల‌విల‌లాడుతున్నారు. ఇది గుర్తించిన అనేక రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌క్ష‌ణ‌మే కేర‌ళ‌కు ఆహార ప‌దార్ధాల‌ను పంపిస్తున్నాయి. ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఒక అడుగు ముందే ఉంది. 100 ట‌న్నుల ఆహారా ప‌దార్ధాల‌ను కేర‌ళ‌కు పంపింది.

52.5 ల‌క్ష‌ల విలువైన బాలామృతం ప్యాకెట్లు కేర‌ళ‌కు చేరాయి. బేగంపేట విమానాశ్ర‌యం నుంచి డిఫెన్స్ కి చెందిన సి 17 గ్లోబ్ మాస్ట‌ర్ విమానం ..కేర‌ళ‌కు చేరుకుంది. తెలంగాణ ప్ర‌భుత్వం పంపిన బాలామృతం ప్యాకెట్లు 50 వేల మంది పిల్ల‌ల‌కు 10 రోజుల పాటు స‌రిపోనున్నాయి. కేర‌ళ‌కు రానున్న రోజుల్లో మరింత సాయం అందిస్తామ‌ని సీఎం కెసిఆర్ భ‌రోసా ఇచ్చారు. కేర‌ళ వ‌ర‌ద బాదితుల‌ను ఆదుకోవాల‌ని తెలంగాణ‌లో ఉన్న వ్యాపార‌వేత్త‌ల‌కు, పారిశ్రామిక వేత్త‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

కేర‌ళ‌కు మ‌రో 5 కోట్లు సాయం ప్ర‌క‌టించిన ప‌ళ‌ణి స‌ర్కార్

త‌మిళ‌నాడులోని ప‌ళ‌ణిస్వామి ప్ర‌భుత్వం కేర‌ళ‌కు 5 కోట్ల విలువైన ప‌దార్ధాల‌ను పంపించ‌నుంది. రైస్, మిల్క్, మిల్క్ పౌడ‌ర్, బెడ్ షీట్లు, మందులు వ‌గైరా సామ‌గ్రి పంపేందుకు చ‌క‌చ‌కా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే 5 కోట్లు ఆర్ధిక సాయం ప్ర‌క‌టించిన త‌మిళ స‌ర్కార్ మ‌రో 5 కోట్లు విలువైన వ‌స్తువులు పంపిస్తూ త‌మ బాధ్య‌త‌ను చాటుకుంది.

కేర‌ళ‌లో వ‌ర‌ద బాదితుల కోసం రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి సేక‌రిస్తున్న‌ప‌దార్ధాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అక్క‌డికి అధికారులు చేర‌వేస్తున్నారు. త‌మిళ‌నాడుకి చెందిన సినీ న‌టులు కూడా కేర‌ళ బాదితుల‌కు అండ‌గా నిలుస్తున్నారు. ల‌క్ష‌లాది రూపాయ‌లు విరాళంగా ప్ర‌క‌టిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here