కేరళలో ప్రకృతి బీభత్సం – యువఇజం న్యూస్ – సహాయం కోరుతుంది

0
227

వందేళ్లలో ఇదే తొలిసారి ‘దాదాపు 100 సంవత్సరాల్లో రానంత పెద్ద విపత్తు ఇప్పుడు సంభవించింది. 80 డ్యాములు తెరిచాం. 324 మంది చనిపోయారు. 1500లకు పైగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో 2,23,139 మంది ఆవాసం పొందుతున్నారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. సుమారు 4వేల మందికిపైగా బాధిత ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ దళాలు కాపాడాయి.

కేరళ ముఖ్యమంత్రి సహాయనిధి వెబ్ లింక్ – ఆన్లైన్ డొనేషన్ చేయండి 

https://cmdrf.kerala.gov.in/

https://donation.cmdrf.kerala.gov.in/

14జిల్లాల్లో రెడ్ అలర్ట్.. అంధకారంలో కేరళ 14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. రాష్ట్రంలో పలుచోట్ల విద్యుత్‌ లేక అల్లాడిపోతున్నారు. కేరళ విద్యుత్‌ బోర్డు పవర్‌కట్‌ చేయడంతో దాదాపు 80శాతం రాష్ట్రం చీకట్లో మగ్గుతోంది. కొబ్బరి, కాఫీ, నల్ల మిరియాలు లాంటి ఇతర ముఖ్య పంటల ఉత్పత్తి కూడా తీవ్రంగా దెబ్బతింది. వరదలు, కొండచరియలు కారణంగా కొజీకోడ్, ఎర్నాకులం, తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిశూర్, పతనమిత్తిట్ట, ఇడుక్కి జిల్లాల్లో రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో అనేక రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటికి దారి మళ్లించారు. అలాగే ఆగస్టు 26 వరకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను రద్దు చేశారు.14 జిల్లాల్లో సుమారు 2లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 32,500పైగా ఎకరాల్లో పంట దెబ్బతిందని నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ప్రకటించింది. కేరళ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని నేషనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీని సుప్రీంకోర్టు కోరింది. మరోవైపు కేరళలోని వరద పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం రాష్ట్రానికి వెళ్లనున్నారు. శనివారం ఉదయం వరద ప్రాంతాలను హెలికాప్టర్‌లో వీక్షించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here