ఏటీఎంలలో నగదు నింపడంపై హోం శాఖ ఆదేశాలు

0
88
బ్యాంకుల ఏటీఎంలను నగదుతో నింపడంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత, పట్టణాల్లో రాత్రి 9 గంటల తర్వాత ఏటీఎంలలో నగదు నింపరాదని, ఈ ఆదేశాలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని ఏటీఎంలలో సాయంత్రం 4 గంటల లోపు మాత్రమే నగదు నింపాలని తెలిపింది. ప్రైవేటు క్యాష్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలు తప్పనిసరిగా బ్యాంకుల నుంచి వాటి పనిదినాల్లో మొదటి అర్ధ భాగంలోనే సేకరించాలని తెలిపింది. నగదును సురక్షిత వాహనాల్లో మాత్రమే రవాణా చేయాలని స్పష్టం చేసింది.
ఈ ఆదేశాలు 2019 ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here