Andhra Pradesh

సీమలో టీడీపీకి మరిన్ని రాజీనామాలు..!

ఇలాంటి పరిణామాల మధ్యన ఫిరాయింపులు జరిగిన చాలా నియోజకవర్గాల్లో టీడీపీ గ్రూపులుగా విడిపోయి బలహీన పడింది.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బాగా ఎదురుదెబ్బ తగిలిన చోటు రాయలసీమ. ఒక్క అనంతపురం జిల్లాను మినహాయిస్తే మిగిలిన మూడు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధించింది. కేవలం రాయలసీమలోనే కాకుండా, రాయలసీమ లాంటి రాజకీయ పరిస్థితులే ఉండే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై చేయిసాధించింది. దీంతో చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయ్యాకా ఈ ప్రాంతాలపై ప్రత్యేకంగా కన్నేశాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను ఫిరాయింపులు చేయించాడు, అలాగే మాజీ కాంగ్రెస్ లీడర్లను కూడా తన పార్టీలోకి చేర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు.

ఇలా ఏవేవో యత్నాలు చేశాడు కానీ.. మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండే సరికి అవేవే వర్కవుట్ కావడం లేదని స్పష్టం అవుతోంది. సీమలో తెలుగుదేశం పార్టీకి రాజీనామాల పర్వం కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ, పాత నేతలకు పొసగక నానా రచ్చ కొనసాగుతూ ఉంది. పాత వాళ్లు, కొత్త వాళ్లు రాజీ పడటం లేదు. గొడవలు పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిణామాల మధ్యన ఫిరాయింపులు జరిగిన చాలా నియోజకవర్గాల్లో టీడీపీ గ్రూపులుగా విడిపోయి బలహీన పడింది.

ఇక తాజాగా జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కొత్త రచ్చలను రేపింది. నామినేటెడ్ పోస్టుల్లో తమకు అవకాశం దక్కలేదని కొందరు, దక్కిన పదవులు అంత గొప్పవి కావని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ పొలిటిషీయన్ చల్లా అసహనాన్ని బహిరంగంగానే చాటాడు. తను పార్టీకి రాజీనామా చేస్తానన్నట్టుగా మాట్లాడాడు.

ఇక నంద్యాలకు చెందిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి కూడా ఇప్పుడు అదే అసహనంతో ఉన్నాడట. ఇప్పటికే ఈయనకూ మంత్రికి అక్కడ అసల పడటం లేదు. ఏవీ, అఖిలప్రియలు బహిరంగంగానే తిట్టుకున్నారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో తనకు అవకాశం దక్కకపోవడంపై ఏవీ ఫైర్ అవుతున్నాడట. ఈయన కూడా టీడీపీకి రాజీనామా చేసే యత్నాల్లో ఉన్నట్టుగా సమాచారం.

Show More
My Domain Hosting.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close