Telangana

బెంగళూరు బయల్దేరిన సీఎం కేసీఆర్‌

ఆయన వెంట సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌, ఎంపీ వినోద్‌, సంతోష్‌ కుమార్‌, సుభాష్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. ఆయన వెంట సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌, ఎంపీ వినోద్‌, సంతోష్‌ కుమార్‌, సుభాష్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. జాతీయస్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టి.. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలంటున్న కేసీఆర్‌ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్నారు. దేవెగౌడ నివాసం అమోఘలో ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుత రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై దేవెగౌడతో చర్చించిన అనంతరం సాయంత్రం సీఎం హైదరాబాద్‌ చేరుకుంటారు.

రాజకీయ వేదిక ఏర్పాటు ప్రక్రియ దిశగా ఇటీవలే కోల్‌కతాలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో కేసీఆర్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్‌ సోరేన్‌ హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఇపుడు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌, దేవెగౌడల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Show More
My Domain Hosting.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close