Entertainment

రామ్ చరణ్ వద్దని సేఫ్ అయ్యాడా ?

చరణ్ తో వర్క్ అవుట్ కాదని గ్రహించి నానిని లైన్ లోకి తీసుకుని ఒప్పించినట్టు తెలుస్తోంది.

నిన్న విడుదలైన కృష్ణార్జున యుద్ధం నాని సినిమాలు అన్నింటిలోకి ఎక్కువ డివైడ్ తెచ్చుకున్న సినిమాగా అభిమానుల మధ్య సైతం చర్చగా మారింది. ఎంసిఎకి కూడా తొలుత ఇలా జరిగినప్పటికీ మరీ ఇంత నెగటివ్ పబ్లిసిటీ అయితే జరగలేదు. ఇప్పటికిప్పుడు ఇది డిజాస్టరా లేక యావరేజా అని చెప్పలేం కాని సూపర్ హిట్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా స్వల్పం.

వీక్ ఎండ్ కాబట్టి ఈ మూడు రోజులు రన్ అవుతుంది కాని తర్వాత మాత్రం కష్టమే అని ట్రేడ్ రిపోర్ట్. ఇక మొదటి రెండు సినిమాలను చక్కని ఎంటర్ టైన్మెంట్ తో ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే తో మెప్పించిన దర్శకుడు మేర్లపాక గాంధీ దీన్ని కామెడీకి యాక్షన్ కి మధ్య నలిపేయడంతో అటు ఇటు కాకుండా పోయింది. పైగా కృష్ణ పాత్రలో దుమ్ము దులిపిన నాని అర్జున్ రోల్ లో తేలిపోవడం ఇంకో మైనస్ గా మిగిలింది. ఇక్కడ రామ్ చరణ్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనే కదా మీ అనుమానం. అక్కడికే వద్దాం.

శర్వానంద్ తో ఎక్స్ ప్రెస్ రాజా తో హిట్ కొట్టాక మేర్లపాక గాంధీ మేకింగ్ స్టైల్ కు ముచ్చటపడ్డ రామ్ చరణ్ ఇతనితో సినిమా చేయాలనీ ఆసక్తి చూపిన మాట నిజం. అప్పట్లో ఈ వార్త బాగా సర్కులేట్ కూడా అయ్యింది. దాని కోసం ఆరు నెలల దాకా టైం తీసుకున్న గాంధీ రాసుకున్న కథ ఇదేనని ఫిలిం నగర్ టాక్. కాని గతంలో తాను నాయక్ లో ఆల్రెడీ డ్యూయల్ రోల్ చేసేసాను కాబట్టి ఇప్పుడు ఇది రిపీట్ లాగా అనిపిస్తుందేమో అని చరణ్ సంశయించి ఆలస్యం చేసాడని దాని వల్లే మేర్లపాక గాంధీ చరణ్ తో వర్క్ అవుట్ కాదని గ్రహించి నానిని లైన్ లోకి తీసుకుని ఒప్పించినట్టు తెలుస్తోంది.

ఇదే కనక నిజమైతే రామ్ చరణ్ సరైన నిర్ణయం తీసుకున్నట్టే. కృష్ణార్జున యుద్ధంలో రామ్ చరణ్ ఇంకా రొటీన్ గా అనిపించేవాడు. మూసలో ఉండకూడదు అనే ఉద్దేశంతో ధృవ, రంగస్థలం లాంటి ఇన్నోవేటివ్ సబ్జెక్ట్స్ వైపు చరణ్ మళ్ళుతుంటే నాని ఇలా రొటీన్ లోకి రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

Show More
My Domain Hosting.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close