Entertainment

అయ్యో అనుపమా ఎంత పని జరిగింది

ఎందుకంటే రామలక్ష్మి పాత్రలో ముందు తననే తీసుకున్నాడు సుకుమార్.

రంగస్థలం సినిమా ఫలితం చూసాక ఆ సక్సెస్ విషయంలో అయ్యో అనుకున్న వాళ్ళలో ఖచ్చితంగా అనుపమ పరమేశ్వరన్ ఉంటుంది. ఎందుకంటే రామలక్ష్మి పాత్రలో ముందు తననే తీసుకున్నాడు సుకుమార్. స్క్రీన్ టెస్ట్ చేసి కొన్ని సాంపిల్ షాట్స్ తీసి చూసాడు. కాని ఎందుకో ఓ మూల తనకు డౌట్.

రామ్ చరణ్ పక్కన రఫ్ గా కనిపించే పాత్రలో హైట్ తక్కువగా ఉండే అనుపమ సెట్ అవుతుందా అని. ఇంకా ఏవో ఇతర కారణాలతో మొత్తానికి అనుపమ రంగస్థలం నుంచి బయటికి వచ్చేసింది. తర్వాత సమంతాను లైన్ లోకి తీసుకున్నాడు సుకుమార్. అప్పటికే నాగ చైతన్యతో సమంతా పెళ్లి దాదాపు ఫిక్స్ అయిపోయింది.

ఇప్పుడు అనుపమ ఫాన్స్ ఒకవేళ రామలక్ష్మిగా అనుపమ చేసుకుంటే ఎలా ఉండేదా అని ఊహించుకుంటున్నారు. మరీ బ్యాడ్ గా అని చెప్పలేం కాని సమంతానే చరణ్ పక్కన పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది అని చెప్పొచ్చు. దర్శకుడిగా సుకుమార్ విజన్ ఇక్కడే అర్థమవుతుంది.

ఒకవేళ సెట్ అవుతుందిలే అని తనను తీసుకున్నా రామలక్ష్మి పాత్రకు ఇంత న్యాయం జరిగేదో లేదో అనుమానమే. పైగా అనుపమ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు చాలా మార్పులే చేయాల్సి వచ్చేది. ఆ రకంగా చూసుకుంటే సమంతా వంద శాతం రైట్ ఛాయస్ అని ఒప్పుకోవాల్సిందే. కాని మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ ఒక ఇండస్ట్రీ హిట్ లో భాగమయ్యే ఛాన్స్ మిస్ అయ్యింది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఇది ఇష్యూ కావడం అందరికి గుర్తే.

Show More
My Domain Hosting.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close