Andhra Pradesh

బాబు ఈ మాట మీద ఎన్నిరోజులుంటాడో చూద్దాం!

భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకున్నాడు చంద్రబాబు.

చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీని నిందించడం ఇది తొలిసారి ఏమీ కాదు. వెనుకటికి 2004 ఎన్నికల్లో తమ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయినప్పుడు భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకున్నాడు చంద్రబాబు. నాడు బాబు మాట్లాడిన మాట ఏమిటంటే.. బీజేపీతో పొత్తు వల్లనే తాము ఓటమిపాలయ్యామని. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే 2004 ఎన్నికల్లోనే గెలిచేవాళ్లమని , తన వైఫల్యాలు అన్నీ బాబు బీజేపీకి రుద్దాడు. అతర్వాత ఐదేళ్లకు వచ్చిన ఎన్నికల్లో బాబు బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. మహాకూటమి అంటూ వెళ్లాడు. అయితే ఎన్నికల్లో నెగ్గలేదు.

అప్పుడు ఆ ఓటమికి మహాకూటమే కారణమని బాబు వాదించాడు. అయితే చివరకు 2014లో మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో పొత్తుతో నష్టపోయామని వెనుకటికి ప్రకటించి, మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు బాబు. ఈ సారి మోడీ గాలి కలిసి వచ్చి బాబు సీఎం అయ్యాడు. కేంద్రంలో అధికార భాగస్వామి అయ్యాడు. అయితే ఇప్పుడు మళ్లీ టర్మ్ ముగుస్తోంది. దీంతో ఇప్పుడు బాబు మళ్లీ బీజేపీకి తలాక్ చెప్పాడు. ఈ విషయాన్ని ఢిల్లీలో మరోసారి చెప్పుకొచ్చాడు చంద్రబాబు.

తాము ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశామని, బీజేపీతో సంబంధాలు ఉండవని చంద్రబాబు ప్రకటించుకున్నాడు. అయితే ఒకవైపు బీజేపీ నేతలను, ఎంపీలను, కేంద్రమంత్రులను కలుస్తూనే చంద్రబాబు బీజేపీతో ఇక తనకు  సంబంధాలు ఉండవన్నాడు. ఇలాంటి డబుల్ టోన్స్ మాట్లాడటం చంద్రబాబుకు కొత్త ఏమీ కాదు. ఒకవైపు బీజేపీ వాళ్లతో సమావేశం అవుతూనే మరోవైపు బీజేపీతో సంబంధాలు లేవని ఆయన అంటున్నాడు. అయితే ఈ మాట మీద చంద్రబాబు ఎన్నాళ్లు ఉంటాడు? అనేది ఆసక్తిదాయకమైన అంశం. ప్రస్తుతానికి మోడీ గ్రాఫ్ పడిపోయిందని, మోడీ గ్రాఫ్ మళ్లీ లేచిందంటే చంద్రబాబు నాయుడు మళ్లీ బీజేపీ పంచకే చేరుతాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు.

Show More
My Domain Hosting.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close