Entertainment

బాబాయ్ తో దూరం గురించి తారక్ చెప్పేసాడుగా

ఇటీవలే జరిగిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవానికి కళ్యాణ్ రామ్ వచ్చాడు కాని తారక్ రాలేదు

నందమూరి బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ కు బయటికి చెప్పుకోని చాలా పెద్ద గ్యాప్ ఉందన్నది నిజం. అది అభిమానులు సైతం ఒప్పుకుంటారు. కెరీర్ మొదట్లో ఇద్దరు కలిసి కొన్ని వేదికల మీద కనిపించడం ఫోటోలు దిగటం లాంటివి చేసారు కాని ఎన్టీఆర్ కు స్టార్ డం వచ్చాక బాలయ్య దూరం అయ్యాడు అన్నది నగ్న సత్యం. కారణాలు బయటికి చెప్పకపోయినా ఆ అగాధం అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది.

ఇటీవలే జరిగిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవానికి కళ్యాణ్ రామ్ వచ్చాడు కాని తారక్ రాలేదు. ఆ రోజు సిటీలోనే ఉన్నాడు. కాని ఆహ్వానం రానందుకే వెళ్లలేదని టాక్ ఉంది. ఇప్పుడు ఐపిఎల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరిస్తున్న జూనియర్ దీని మీద మీడియా అడిగిన ప్రశ్నకు కాస్తంత నేరుగానే సమాధానం ఇచ్చాడు.

బాబాయి తీస్తున్న బయోపిక్ గురించి తనకు అంతగా తెలియదని అందులో ఒకవేళ పాత్ర ఉంది వేయమని పిలిస్తే మాత్రం తప్పకుండా చేస్తానని చెప్పాడు. ఒకవేళ ఈ విషయంగా బాలకృష్ణ కనక మీకు ఫోన్ చేస్తే తనకు చెప్పమని కోరడం కొసమెరుపు. ప్రెస్ మీట్ మొత్తం చాలా హుషారుగా కొత్త ఎనర్జీతో కనిపించిన ఎన్టీఆర్ మాటలలో తనకు చరణ్ కు ఎంత ఫ్రెండ్ షిప్ ఉందో ఏకవచనంలో సంభోదించడం ద్వారా కూడా బయట పెట్టేసాడు.

చరణ్ మీకు చెప్పాడుగా ఆ మాటే నా మాట అంటూ తాము రెగ్యులర్ టచ్ లో ఉన్న విషయాన్నీ చెప్పకనే చెప్పేసాడు. మెగా కాంపౌండ్ కి దగ్గరయ్యేందుకు ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నాడు అన్న కామెంట్ కు బలమిచ్చేలా మల్టీ స్టారర్ ఇప్పటికే హాట్ టాపిక్ గా మారగా బాబాయ్ తో దూరాన్ని, తన మెగా ఫ్రెండ్ తో స్నేహాన్ని ఒకే మీట్ లో క్లారిటీ ఇచ్చేసిన తారక్ త్రివిక్రమ్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

Show More
My Domain Hosting.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close