Andhra Pradesh

టీడీపీ ఫేస్‌బుక్ పేజీ పోల్: నెక్ట్స్ సీఎం జగన్!

తెలుగుదేశం పార్టీ అప్ డేట్స్ ను తెలుసుకోవడానికే వాళ్లంతా ఆ ఫేస్ బుక్ పేజీకి లైకులు కొట్టారు.

అదొక తెలుగుదేశం అనుకూల ఫేస్‌బుక్ పేజీ. దానికి లైకులు కొట్టిన వాళ్లంతా తెలుగుదేశం వీరాభిమానులే,. తెలుగుదేశం పార్టీ అప్ డేట్స్ ను తెలుసుకోవడానికే వాళ్లంతా ఆ ఫేస్ బుక్ పేజీకి లైకులు కొట్టారు. అలా ప్రతి పార్టీకి ఫేస్ బుక్ పేజీలు ఉంటాయి కదా. అలాంటి వాటిల్లో టీడీపీ అనుకూల పేజీ కూడా ఒకటి. అలాంటి దాంట్లో నిర్వహించిన ఒక పోల్ ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది. ఏ పార్టీ ఫేస్ బుక్ పేజీ ల్లో నిర్వహించే పోల్స్ లో ఆ పార్టీనే ముందంజలో ఉంటుంది. ఆ పార్టీల అనుకూల ఫలితాలే ఉంటాయి.

అయితే తెలుగుదేశం పార్టీ అనుకూల ఫేస్ బుక్ పేజీలో నిర్వహించిన ఒక పోల్ మాత్రం జగన్ ను కాబోయే ముఖ్యమంత్రిగా తేల్చింది. ఇదేమీ అతి తక్కువ మంది పాల్గొన్న పోల్ కాదు. ఏకంగా 14,300 మంది నెటిజన్లు ఆ పోల్ లో పాలుపంచుకున్నారు. వాళ్లలో మెజారిటీ ఫేస్ బుక్ యూజర్లు జగన్ ను కాబోయే ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు. వీరి శాతం 51గా ఉంది.

అసలుకు తెలుగుదేశం పార్టీ అనుకూల ఫేస్ బుక్ పేజీలో నిర్వహించిన పోల్ అంటే.. అందులో నూటికి నూరు శాతం చంద్రబాబుకు అనుకూలంగా ఉండాలి. మళ్లీ కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన పేరే ముందుండాలి. అయితే అలాంటి పేజీలో జగన్ కు మెజారిటీ లభించడం నిజంగా విశేషమే. ఏకంగా 51 శాతం మంది జగన్ ను కాబోయే ముఖ్యమంత్రిగా పేర్కొన్నారట. తాము ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సదరు ఫేస్ బుక్ పేజీ నిర్వాహకులు ఆ పోల్ ను డిలీట్ చేసేశారని తెలుస్తోంది. మొత్తానికి తెలుగుదేశానికి గట్టి ఝలక్ లే తగులుతున్నాయి!

Show More
My Domain Hosting.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close